బిట్‌కాయిన్‌ @12వేల డాలర్లు

Bitcoin extends gains, rises above $12,000 to record high-Reuters - Sakshi

ఒకవైపు  క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌పై  అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు  కొనసాగుతున్నాయి. మరోవైపు బిట్‌ కాయిన్‌ శరవేగంగా పరుగులు పెడుతోంది. తాజాగా మరో  ఆల్‌టైం హైని టచ్‌ చేసింది. ఇటీవల పదివేల డాలర్ల మార్క్‌ను టచ్‌ చేసిన బిట్‌కాయిన్‌  మరో గరిష్టాన్ని నమోదు చేసింది.

ఈ ఏడాదిలో బిట్‌కాయిన్‌ భారీ ర్యాలీతో మార్కెట్లను షేక్‌ చేస్తోంది. వరుస రికార్డు స్థాయియిలను నమోదు చేస్తూ   దూసుకుపోతోంది.  తాజాగా ఈ ఆన్‌లైన్‌ మనీ తొలిసారిగా 12వేల డాలర్ల మైలురాయిని దాటింది.  భారీ లాభాలనునమోదు చేస్తున్న బిట్‌కాయిన్‌  12వేల డాలర్ల స్థాయిని తాకిందని రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది. అయితే  బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌లో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరించారు. అటు మరో ఏడాదిన్నరలో బిట్‌కాయిన్‌ ధర 50వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు చేరుతుందని ఫోరేట్రస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ మాజీ ఫండ్‌ మేనేజర్‌ నోవోగ్రాట్జ్‌ ఇటీవల అభిప్రాయపడ్డారు.

కాగా బిట్‌కాయిన్స్‌ వంటి వర్చువల్‌ కరెన్సీలు చాలా రిస్కుతో కూడుకున్న నేపథ్యంలో వీటి ట్రేడింగ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని యూజర్లు, ట్రేడర్లను రిజర్వ్‌ బ్యాంక్‌ హెచ్చరించింది.  బిట్‌కాయిన్‌ లేదా ఇతర వర్చువల్‌ కరెన్సీల (వీసీ) నిర్వహణ, చలామణీకి సంబంధించి ఏ కంపెనీకి కూడా లైసెన్సులు ఇవ్వలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top