దలాల్‌ స్ట్రీట్‌లో డోజోన్స్‌ ప్రకంపనలు

Benchmark indices Sensex, Nifty decline over 1.5 pc in opening trade - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  మరోసారి భారీగా పతనాన్ని నమోదు చేశాయి. గ్లోబల్‌ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో  ఈక్విటీ మార్కెట్లు  ఆరంభంలోనే 500పాయింట్లకు పైగా నష్టపోయాయి.   అయితే ఇతర ఆసియన్‌ మార్కెట్లతో  పోలిస్తే పతనం తక్కువగా ఉంది. షాంఘై 5.22శాతం,నిక్కీ3.22 శాతం పతనం కాగా నిఫ్టీ 1.5శాతం నష్టంతో ఉంది.

సెన్సెక్స్‌ 514 పాయింట్ల పతనంతో 33, 898వద్ద, నిఫ్టీ10,417వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  దాదాపు అన్ని సెక్టార్లు  నెగిటివ్‌గానే ఉన్నాయి.  రియల్టీ, బ్యాంకింగ్‌ , ఫార్మ భారీగా నష్టపోతున్నాయి. సింగ్‌ బ్రదర్స్‌ ఫోర్టిస్‌కు రాజీనామా చేశారన్న వార్తలతో ఫోర్టిస్‌  హెల్త్‌ కేర్‌ భారీగా (8శాతం)  లాభపడుతోంది.  వేదాంతా, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా, గ్లెన్‌మార్క్‌,  రిలయన్స్‌ క్యాప్‌,  బాటా, ఇన్‌ఫ్రాటెల్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐబీ హౌసింగ్‌, ఐటీసీ, యాక్సిస్‌, అల్ట్రాటెక్, అంబుజా, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌ తదితర షేర్లు నష్టపోతున్నాయి.  మరోవైపు సెయిల్‌, సీసీడీ, గోవా కార‍్బన్‌ స్వల్పంగా లాభపడుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top