బంధన్‌ బ్యాంక్‌ బంపర్‌ లిస్టింగ్‌ | Bandhan Bank Bumper listing | Sakshi
Sakshi News home page

బంధన్‌ బ్యాంక్‌ బంపర్‌ లిస్టింగ్‌

Mar 28 2018 12:28 AM | Updated on Mar 28 2018 12:28 AM

Bandhan Bank Bumper listing - Sakshi

న్యూఢిల్లీ: బంధన్‌ బ్యాంక్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించాయి. ఇష్యూ ధర(రూ.375)తో పోల్చితే ఈ షేర్‌ బీఎస్‌ఈలో 29 శాతం లాభంతో రూ.485 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 33 శాతం లాభంతో రూ.498 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 27 శాతం లాభంతో రూ.477 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 1.39 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో 9 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.56,921 కోట్లుగా నమోదైంది.

మార్కెట్‌ క్యాప్‌ పరంగా ఎనిమిదో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించింది. లిస్టైన అన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల కంటే(ఎస్‌బీఐ మినహా) బంధన్‌ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ అధికం కావడం విశేషం. రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. పీఎన్‌బీ, ఇతర ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు.. కెనరా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీబీఐ బ్యాంక్‌ల కంటే కూడా ఈ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ అధికంగా ఉంది.

ఈ నెల 15–19 మధ్య రూ.370–375 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 15 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ బ్యాంక్‌  రూ.4,473 కోట్లు సమీకరించింది. భారత్‌లో ఇదే అతి పెద్ద బ్యాంక్‌ ఐపీఓ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement