త్వరలో బజాజ్ 400 సీసీ పల్సర్ బైక్ | Bajaj set to launch 400cc Pulsar | Sakshi
Sakshi News home page

త్వరలో బజాజ్ 400 సీసీ పల్సర్ బైక్

Jan 19 2015 1:44 AM | Updated on Sep 2 2017 7:52 PM

త్వరలో బజాజ్  400 సీసీ పల్సర్ బైక్

త్వరలో బజాజ్ 400 సీసీ పల్సర్ బైక్

బజాజ్ ఆటో కంపెనీ ఆరు నెలల్లో ఆరు కొత్త మోడళ్లను తేనున్నది.

* ఆరు నెలల్లో ఆరు కొత్త టూవీలర్లు
* మార్చికల్లా కొత్త 100సీసీ బైక్


న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కంపెనీ ఆరు నెలల్లో ఆరు కొత్త మోడళ్లను తేనున్నది. వీటిల్లో మార్చి కల్లా కొత్తగా 100 సీసీ బైక్‌ను తెస్తామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్(బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ఎష్యూరెన్స్) ఎస్. రవికుమార్ తెలిపారు. టూవీలర్ల మార్కెట్లో కోల్పోయిన వాటా తిరిగి పొందడానికి ఆరు నెలల్లో నెలకొక కొత్త బైక్‌ను అందిస్తామని వివరించారు.

ప్రస్తుతం 16-17 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను 20 శాతానికి పెంచుకోవడం లక్ష్యమని పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే 400 సీసీ కేటగిరీలో పల్సర్ బైక్‌ను తేనున్నామని వివరించారు. కొత్తగా తేనున్న ఈ బైక్‌ల కారణంగా మార్కెట్ వాటా పెంచుకోగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పల్సర్, కేటీఎం, ప్లాటిన బ్రాండ్ బైక్‌ల అమ్మకాలు పెరుగుతున్నాయని, డిస్కవర్ బైక్‌ల అమ్మకాలు తగ్గుతున్నాయని తెలిపారు.

Advertisement
Advertisement