breaking news
Bikes sales
-
కార్లు, బైక్‌లు.. బాగానే కొన్నారు..
దేశీయంగా ఆటో మొబైల్ రిటైల్ అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. అంతకుముందు ఏడాది(2024)తో పోలిస్తే 2025లో 8 శాతం మేర విక్రయాలు పెరిగాయి. ప్రథమార్ధమంతా మందగమనాన్ని ఎదుర్కొన్నప్పటికీ..., జీఎస్టీ 2.0 అమలు తర్వాత వాహన విక్రయాలు పరుగులు పెట్టాయని ఆటో మొబైల్ సమాఖ్య(ఫాడా) పేర్కొంది. ఇందుకు సంబంధించి గణాంకాలు విడుదల చేసింది. 2024 క్యాలెండర్ ఇయర్లో 2,61,45,445 యూనిట్లు అమ్ముడవ్వగా.., 2025లో 2,81,61,228 యూనిట్లు మేర అమ్ముడయ్యాయని ఫాడా తెలిపింది.2025లో విక్రయాలు ఇలా...,∙2024లో 40,79,532 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా.., 2025లో 10% వృద్ధితో 44,75,309 యూనిట్లు అమ్ముడయ్యాయి.∙టూవీలర్ అమ్మకాల్లో 7.24 శాతం వృద్ధి నమోదైంది. 2024లో 1,89,24,815 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025లో 2,02,95,650 యూనిట్లు విక్రయమయ్యాయి.∙త్రిచక్ర వాహన అమ్మకాలు 2024లో 12,21,886 యూనిట్లు కాగా.. 2025లో 7.21 శాతం వృద్ధితో 13,09,953 యూనిట్లు అమ్ముడయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు 6.71% పెరిగి 10,09,654 యూనిట్లుగా నమోదయ్యాయి. 2024లో ఇవి 9,46,190 యూనిట్లుగా ఉన్నాయి.‘‘2025 ఏడాది దేశీయ ఆటో పరిశ్రమ ప్రయాణాన్ని రెండు దశలుగా అభివర్ణించవచ్చు. జనవరి నుంచి ఆగస్టు వరకు.... కేంద్ర బడ్జెట్లో ప్రత్యక్ష పన్ను రాయితీలు, ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు వంటి సానుకూలతలున్నప్పట్టకీ.., అమ్మకాలు స్తబ్దుగా సాగాయి. ఈ దశలో కస్టమర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తత వహించారు. అయితే సెప్టెంబర్ నుంచి పరిస్థితి మారింది. జీఎస్టీ 2.0 సవరణలో భాగంగా 350 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైకులు, స్కూటర్లపై జీఎస్టీని 28% నుంచి 18 శాతానికి తగ్గించారు. అలాగే పెట్రోల్ కార్లలో 1200 సీసీ కన్నా, డీజిల్ కార్లలో 1500 సీసీ కన్నా తక్కువ వాటిపై జీఎస్టీని 28% నుంచి 18 శాతానికి తగ్గించారు. ప్రభావంతో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో వాహన విక్రయాలు గణనీయంగా పుంజుకున్నాయి’’ అని ఫాడా అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.వాహన పరిశ్రమ విద్యుదీకరణ(ఎలక్ట్రిఫికేషన్)వైపు అడుగులను 2025 ఏడాది స్వాగతించిందన్నారు. టూ వీలర్స్, పీవీ, సీవీ, త్రీ వీలర్స్ ఇలా అన్ని విభాగాల్లో ఈవీ వాటా గణనీయంగా పెరిగిందన్నారు. మొత్తంగా.. 2025 క్యాలెండర్ సంవత్సరం ఉత్సాహభరితంగా ముగిసిందన్నారు. ఈ ఏడాది(2026) అవుట్లుపై ఫాడా వివరణ ఇస్తూ .., ‘‘తొలి మూడు నెలల్లో రిటైల్ విక్రయాలకు ఢోకా లేదు. తాము నిర్వహించిన సర్వే ప్రకారం, 74.91% డీలర్లు వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నారు. జీఎస్టీ 2.0తో కొనుగోళ్ల సామర్థ్యం పెరగడం, పండుగలు, వివాహాల సీజన్, ఆర్థిక సంవత్సరం ముగింపులో కనిపించే కొనుగోళ్ల ప్రభావం డిమాండ్‌కు మద్దతునిస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ(ఐఎండీ) ముందస్తు అంచనాల ప్రకారం ఏడాది వర్షపాతం తగిన మోతాదులో ఉండొచ్చు. కావున గ్రామీణ ప్రాంతాల డిమాండ్ ఎలాగూ ఉంటుంది. స్థూల ఆర్థిక గణాంకాల దృష్ట్యా పరిశీలిస్తే... ఆర్బీఐ రెపో రేటు 5.25% వద్ద ఉండటం రుణ వ్యయాల విషయంలో అదనపు ఊరట లభిస్తోంది. అలాగే, వినియోగానికి పెద్దపీట వేసే విధంగా పన్ను రాయితీలకు ప్రాధాన్యం ఇచ్చే బడ్జెట్ రావొచ్చంటూ చర్చలు జరుగుతున్నాయి. అలాంటి బడ్జెట్ అమలులోకి వస్తే, డ్రిస్కేషనరీ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. సరఫరా సరైన సమయానికి సరఫరా, ఫైనాన్స్ ప్రక్రియల వేగవంతం, డీలర్ నెట్‌వర్క్‌లో క్రమబద్ధమైన నిల్వ నిర్వహణ జరిగితే..., 2026లోనూ ఆటో అమ్మకాలు టాప్‌గేర్ దూసుకెళ్లే వీలుందని ఫాడా అంచనా వేసింది. -
త్వరలో బజాజ్ 400 సీసీ పల్సర్ బైక్
* ఆరు నెలల్లో ఆరు కొత్త టూవీలర్లు * మార్చికల్లా కొత్త 100సీసీ బైక్ న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కంపెనీ ఆరు నెలల్లో ఆరు కొత్త మోడళ్లను తేనున్నది. వీటిల్లో మార్చి కల్లా కొత్తగా 100 సీసీ బైక్‌ను తెస్తామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్(బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఎష్యూరెన్స్) ఎస్. రవికుమార్ తెలిపారు. టూవీలర్ల మార్కెట్లో కోల్పోయిన వాటా తిరిగి పొందడానికి ఆరు నెలల్లో నెలకొక కొత్త బైక్‌ను అందిస్తామని వివరించారు. ప్రస్తుతం 16-17 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను 20 శాతానికి పెంచుకోవడం లక్ష్యమని పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే 400 సీసీ కేటగిరీలో పల్సర్ బైక్‌ను తేనున్నామని వివరించారు. కొత్తగా తేనున్న ఈ బైక్‌ల కారణంగా మార్కెట్ వాటా పెంచుకోగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పల్సర్, కేటీఎం, ప్లాటిన బ్రాండ్ బైక్‌ల అమ్మకాలు పెరుగుతున్నాయని, డిస్కవర్ బైక్‌ల అమ్మకాలు తగ్గుతున్నాయని తెలిపారు.


