అధ్బుత ఫీచర్లతో ఆసుస్‌ స్మార్ట్‌ఫోన్‌

Asus ZenFone 6 Launched Globally - Sakshi

ఆసుస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ 6 

రొటేటింగ్‌ కెమెరా  స్పెషల్‌ ఎట్రాక్షన్‌

భారీ స్టోరేజ్‌, శక్తివంతమైన ప్రాసెసర్

ప్రముఖ  స్మార్ట్‌ఫోన్‌ తయారీ దారు  ఆసుస్ తాజాగా మరో కొత్త స్మా్ర్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.   జెన్‌ ఫోన్‌​ సిరీస్‌లో  ‘జెన్‌ఫోన్ 6’  పేరుతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్‌  చేసింది.  స్పెయిన్‌లో గురువారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఈ ఫోన్‌ను  ఆ విష్కరించింది.  ఈ ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లోకి కూడా  రానుంది.

రొటేటింగ్ కెమెరా జెన్‌ఫోన్‌ 6 స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని  కెమెరాను మనకను గుణంగా ముందుకు, వెనక్కు రొటేట్‌ చేసుకోవచ్చన్నమాట. 8 జీబీ ర్యామ్/256 జీబీ  స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్‌ 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్‌ ఇలా మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.

ఆసుస్ జెన్‌ఫోన్ 6  ఫీచర్లు  
6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 
ఆండ్రాయిడ్ 9.0 పై 
48+13 ఎంపీ  డ్యుయల్ రియర్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్‌

ధర : రూ.39,000 నుంచి ప్రారంభం 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top