
సాక్షి, న్యూఢిల్లీ : ఈ -కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో 6500కు పైగా తాత్కాలిక ఉద్యోగాలను ఆఫర్ చేసింది. ఈ నెల 20-24 వరకూ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ను నిర్వహిస్తుండటంతో ఈ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. సీజనల్ నియామకాల్లో భాగంగా సీజనల్ పొజషన్స్ కోసం 6500 మందిని విధుల్లోకి తీసుకుంటున్నామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా చెప్పారు.
ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు, సార్టేషన్ సెంటర్లలో ఈ నియామకాలు ఉంటాయని అన్నారు. సేల్ పీరియడ్‌లో కస్టమర్ల నుంచి అధిక డిమాండ్‌ను అధిగమించేందుకు 1000 మంది అసోసియేట్స్‌ను నియమిస్తామని చెప్పారు.గ్రేట్ ఇండియన్ సేల్‌ను విజయవంతంగా నిర్వహించి, వినియోగగారులకు మెరుగైన డెలివరీ సేవలు అందించేందుకు అసోసియేట్ల నియామకం ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూర్ వంటి పలు మెట్రో నగరాల్లో ఈ నియామకాలు చోటు చేసుకుంటాయని సక్సేనా తెలిపారు.