అమెజాన్‌ సేల్‌ : వాటిపై అదిరిపోయే ఆఫర్లు

Amazon Great Indian Sale 2020 Begins Today for Prime Members - Sakshi

అమెజాన్‌ గ్రేడ్‌ ఇండియన్‌ సేల్‌-2020

ఒప్పో ఎఫ్‌11 పై భారీ తగ్గింపు

ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై భారీ ఆఫర్లు

సాక్షి,ముంబై: ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో మరోసారి తగ్గింపుధరలు, ఆఫర్ల పండుగ మొదలైంది. గణతంత్ర దినోత్సవం (రిప్లబిక్‌ డే) అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-2020 పేరుతో స్పెషల్‌ విక్రయాలను చేపట్టింది. జనవరి 22 వరకు కొనసాగే సేల్‌ ఈ రోజు (శనివారం)  అర్థరాత్రి నుంచే ప్రైమ్‌ మెంబర్లకు అందుబాటులోకి తేనుంది. ప్రధానంగా వివిధ బ్రాండ్ల స్మార్ట్‌ ఫోన్లతోపాటు, పలురకాల ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ప్రకటించింది.

స్మార్ట్‌ఫోన్లపై  40శాతం దాకా, ల్యాప్‌ట్యాప్‌లు, కెమెరాలపై 60 శాతం  తగ్గింపు లభించనుంది. దీంతో  ల్యాప్‌టాప్‌లపై రూ.35వేల దాకా, కెమెరాలపై  రూ. 10,000 వరకూ ప్రత్యేక తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం  డిస్కౌంట్‌ కూడా అదనం. వన్‌ప్లస్‌ 7టీ,  వన్‌ఫ్లస్‌ 7టీ ప్రొ, రెడ్‌మినోట్‌ 8 ప్రొ,  ఒప్పో  ఎఫ్‌ 11 వివో యూ 20లపై ఈ తగ్గింపు ధరల్లో అందుబాటులో  ఉంటాయి.  ప్రధానంగా ఒప్పో ఎఫ్‌ 11 భారీగా పదివేల దాకా డిస్కౌంట్‌  ధరలో లభించనుంది.  ప్రస్తుత సేల్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 13,990 కే కొనుగోలు చేయవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top