టెక్నికల్‌ ప్రాబ్లమ్‌.. అమెజాన్‌తో తంటాలు

Amazon Face-Recognition Identifies US Leaders As Criminals - Sakshi

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సాంకేతికతతో అమెరికన్‌ సెనెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెజాన్‌.కామ్‌కు చెందిన ఫేషియల్‌ రికగ్నిషన్‌(ముఖాలను గుర్తించే) మెషీన్లు వారి గుర్తింపును తప్పుగా చూపిస్తున్నాయి. కరుడుగట్టిన క్రిమినల్స్‌గా గుర్తిస్తుండటంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మే నెల నుంచి మరీ ఎక్కువైపోయిందని ప్రముఖ సర్వే సంస్థ ది అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ ఆఫ్‌ నార్తన్‌ కాలిఫోర్నియా(ఏఎల్‌సీయూ) ఓ నివేదికలో వెల్లడించింది. ఓరెగాన్‌, ఓర్లాండో, ఫ్లోరిడాలోని సెనెటర్ల కోసం ఏర్పాటు చేసిన మెషీన్లలో ఈ పొరపాటును ఎక్కువగా గుర్తించారు. ఎడర్వర్డ్‌ మార్కే, డీ మాస్‌, తదితరులతోపాటు లూయిస్‌ లాంటి దిగ్గజాలను ఇలా మొత్తం 28 మంది సెనెటర్లను క్రిమినల్స్‌గా గుర్తింపును చూపిస్తు‍న్నాయి. 

చట్టసభల్లో, కార్యాలయాల్లో, సమావేశాల్లో వాళ్లు పాల్గొన్నప్పుడు సెనెటర్లను ఫేషియల్‌ సర్వైలెన్స్ కెమెరాలు వారిని క్రిమినల్స్‌గా చూపిస్తున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై వారి వద్దకు వెళ్తున్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా ఇబ్బందులే ఎదురవుతున్నాయి అని  ఏసీఎల్‌యూ పేర్కొంది. ఒక్క కాలిఫోర్నియాలోనే 25,000 వేల మంది డేటా అమెజాన్‌ ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తమై ఉంది. అలాంటప్పుడు మున్ముందు సామాన్యులకు కూడా ఈ పొరపాటుతో ముప్పు తలెత్తే అవకాశం ఉందని ఏఎల్‌సీయూ అంటోంది. ఈ విషయంలో గతంలో కొందరు సెనెటర్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని వెల్లడించింది. అయితే అమెజాన్‌ మాత్రం తమ పొరపాటును సర్దిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తోంది. ‘ఒక వ్యక్తి రియల్‌ టైమ్‌ ఇమేజ్‌లను పాత ఫొటోలతో పోల్చి ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ పనిచేస్తుంది. అలాంటప్పుడు పొరపాటు సదరు ఏజెన్సీ సంస్థలదే తప్ప మాది కాదు’ అని అమెజాన్‌ ప్రతినిధి ఒకరు చెబుతున్నారు.

రాయల్‌ వివాహ వేడుక దగ్గరి నుంచి చిన్న చిన్న పార్కుల్లో పిల్లలు తప్పిపోయిన సమయంలో కూడా అమెజాన్‌ మెషీన్లనే ఉపయోగిస్తున్నారని, అక్కడ ఎవరికీ రాని ఇబ్బందులు ఇక్కడ మాత్రమే ఎందుకొస్తున్నాయన్న వాదనను అమెజాన్‌ తెరపైకి తెస్తున్నారు. ఏల్‌సీయూ మాత్రం మెషీన్లలో 80 శాతం ఇన్‌స్టాలైజేషన్‌లో పొరపాట్లు ఉన్నాయని, కావాలంటే బహిరంగంగా నిరూపిస్తామని అంటోంది. ఏదిఏమైనా టెక్నాలజీపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టి వినియోగదారుల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం అమెజాన్‌పైనే ఉందన్నది చాలా మంది చెబుతున్న అభిప్రాయం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top