తిరుపతికి అలయన్స్ ఎయిర్‌ అదనపు విమాన సర్వీసులు | Alliance Air additional flights to Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతికి అలయన్స్ ఎయిర్‌ అదనపు విమాన సర్వీసులు

Dec 31 2016 2:05 AM | Updated on Sep 4 2018 5:07 PM

తిరుపతికి  అలయన్స్ ఎయిర్‌ అదనపు విమాన సర్వీసులు - Sakshi

తిరుపతికి అలయన్స్ ఎయిర్‌ అదనపు విమాన సర్వీసులు

ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్‌ పండుగల సీజన్ ను దృష్టిలో పెట్టుకుని జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌–తిరుపతి మధ్య అదనపు సర్వీసులు నడుపనుంది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్‌ పండుగల సీజన్ ను దృష్టిలో పెట్టుకుని  జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌–తిరుపతి మధ్య అదనపు సర్వీసులు నడుపనుంది. జనవరి 7న హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2.50కి బయల్దేరి తిరుపతిలో 4.10కి ల్యాండ్‌ అవుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.40కి ప్రారంభమై భాగ్యనగరికి 6 గంటలకు చేరుతుంది. జనవరి 8న హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3.20కి టేకాఫ్‌ అయ్యి, తిరుపతిలో 4.40కి అడుగు పెడుతుంది. తిరిగి సాయంత్రం 5.10కి బయల్దేరి హైదరాబాద్‌లో 6.30కి చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement