మెరుగైన సేవలకే హోమ్‌ డెలివరీ: ఎయిర్‌టెల్‌

Airtel To Home Deliver SIM Cards To Customers In Hyderabad - Sakshi

అన్ని పట్టణాలలో ఎయిర్‌టెల్‌ రిటైల్‌ స్టోర్స్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ దిగ్గజం ఎయిర్‌టెల్‌ వినుత్న అలోచనకు అంకురార్పణ చేసింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎయిర్‌టెల్ వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా సిమ్‌ కార్డులను హోమ్‌ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. అదే విధంగా ఇంటర్‌నెట్‌, డీటీఎచ్‌(టీవీ రీచార్జ్‌) తదితర సేవలను వినియోగదారులు ఇంటి నుంచే పొందవచ్చని పేర్కొంది. తాజా సేవలపై ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విట్టల్‌ స్పందిస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ.. సిమ్‌కార్డు జారీ, ఇంటర్‌నెట్‌, డీటీఎచ్‌ తదితర సేవలను కస్టమర్లకు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హోమ్‌ డెలివరీ చేసే ఉద్యోగులకు ప్రుభుత్వ నియమాల ప్రకారం శిక్షణ ఇచ్చామని  అన్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించామని.. విస్తృత సేవలందిస్తున్న ఎయిర్‌టెల్‌ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలలో ఎయిర్‌టెల్‌ రిటైల్‌ స్టోర్స్‌ను ప్రారంభించామని తెలిపారు.

ప్రస్తుత కష్ట కాలంలో రీచార్జ్‌ చేసుకోలేనివారి కోసం ‘సూపర్ హీరోస్‌’ అనే ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. రీచార్జ్‌ చేసుకోలేని వారికి ఈ కార్యక్రమం‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే 10 లక్షల మంది కస్టమర్లు ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కావడంతో పాటు అవసరమైన వారికి రీచార్జ్‌ చేశారని గోపాల్‌ విట్టల్ కొనియాడారు.
చదవండి: డిస్నీ+హాట్‌స్టార్ విఐపీ ఫ్రీ: ఎయిర్‌టెల్ కొత్త ప్యాక్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top