జియోను బీట్‌ చేసిన ఎయిర్‌టెల్‌, దేనిలో?

Airtel Beats Jio, Vodafone In TRAI 4G Speed Test - Sakshi

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ టెస్ట్‌లో దూసుకుపోయింది. జియోను దాటేసి, ఎయిర్‌టెల్‌ మెరుగైన పాయింట్లను స్కోర్‌ చేసిందని తాజా డేటాలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ట్రాయ్‌ చేపట్టిన 4జీ డౌన్‌లోడ్‌ స్పీడు టెస్ట్‌లో.. జియో, వొడాఫోన్‌, ఐడియాల కంటే ఎయిర్‌టెల్‌ మెరుగైన స్కోర్‌ను పొంది, 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ప్రొవైడర్‌గా నిలిచింది. ఆల్ట్రా న్యూస్‌ రిపోర్టు ప్రకారం ఎయిర్‌టెల్‌ సగటు డౌన్‌లోడ్‌ స్పీడు 9.64 ఎంబీపీఎస్‌ కాగ, జియో 4జీ డౌన్‌లోడ్‌ స్పీడు 6.57 ఎంబీపీఎస్‌గా, ఐడియా సెల్యులార్‌ డౌన్‌లోడ్‌ స్పీడు 7.41ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఈ రిపోర్టు ప్రకారం ఎయిర్‌టెల్‌ సగటు డౌన్‌లోడ్‌ స్పీడు జియో కంటే 44 శాతం వేగవంతంగా ఉన్నట్టు వెల్లడైంది. టెస్ట్‌ జరిపిన 10 నగరాల్లో హర్యానాలోని భివాని, రాజస్తాన్‌లోని కొటా, కేరళలోని కాలికట్‌ ఉన్నాయి.  

అయితే మైస్పీడు యాప్‌లో జియో సగటు డౌన్‌లోడ్‌ స్పీడు 20.3 ఎంబీపీఎస్‌గా ఉంది. ఎయిర్‌టెల్‌ 8.9గా, ఐడియా 8.2ఎంబీపీఎస్‌గా రికార్డైంది. అక్టోబర్‌లో నిర్వహించిన ప్రత్యేక ట్రాయ్‌ టెస్ట్‌లో మాత్రం జియో 21.9ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడుతో తొలి స్థానంలో ఉంది. ఈ సారి మాత్రం జియోను అధిగమించి, ఎయిర్‌టెల్‌ ముందుకు వచ్చేసింది. తన ప్రత్యర్థులకు పోటీగా ఎయిర్‌టెల్‌ పలు రీఛార్జ్‌ ప్లాన్లను ప్రవేశపెడుతూ వచ్చింది. కంపెనీ ఇటీవలే రూ.499 పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌ కింద అపరిమిత కాల్స్‌, 40జీబీ డేటా, 30రోజుల బిల్లింగ్‌ సైకిల్‌ ద్వారా ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్‌ చేస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top