ఎయిర్‌ ఏషియా బంపర్‌ సేల్‌

 Air Asia Discount For International And Domestic Flights - Sakshi

సాక్షి,ముంబై:  ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. బై మోర్‌, సేవ్‌ మోర్‌ ఆఫర్‌లో భాగంగా దేశీయ,అంతర్జాతీయ ప్రయాణాలపై 40 శాతం (వన్‌ వే)రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా  బుక్‌ చేసుకున్న టికెట్లపై రేపటి నుంచి   (31 జూలై)నవంబరు 30 మధ్య ప్రయాణించవచ్చు. ఆగస్టు 5 వరకు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

అంతర్జాతీయ రూట్లలోనూ 40 శాతం డిస్కౌంట్‌  అందించనుంది.  ఎయిర్‌ ఏషియా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేసే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. క్రిడిట్‌, డెబిట్‌, చార్జ్‌కార్డ్‌ ద్వారా జరిగే పేమెంట్స్‌ ప్రాసెసింగ్‌ ఫీ నాన్‌-రిఫండబుల్‌. సీట్లు పరిమితంగా ఉంటాయి.  ఎంపిక చేసిన విమానాలకు ఆఫర్‌ టికెట్లు వర్తించనున్నాయి.  టికెట్లన్నీ సింగిల్‌ జర్నీకి ఉద్దేశించినవనీ, ఆఫర్‌లో భాగంగా జరిగే ఫేమెంట్స్‌ రిఫండ్‌ చేయనమని ఎయిర్‌ ఏషియా వెల్లడించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top