60సెకన్లలో పాన్-ఆధార్ అనుసంధానం
ప్రభుత్వం నోటీస్ జారీచేసిన ఆదేశాల ప్రకారం ఆధార్‌తో పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్)ను లింకు చేయడం జులై 1 నుంచి ఇది అమల్లోకి రానున్నది.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ కొత్త నిబంధనల ప్రకారం పాన్ కార్డ్ నంబర్‌తో ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీచేసిన ఆదేశాల ప్రకారం ఆధార్‌తో పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్)ను లింకు చేయడం జులై 1 నుంచి ఇది అమల్లోకి రానున్నది. జులై 1, 2017లోపు పాన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఆధార్‌తో లింకు చేయాల్సిందేనని ఆదాయ శాఖ స్పష్టంచేసింది. ఇప్పటికే 2 కోట్ల 7 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ తమ పాన్‌ను ఆధార్‌తో లింకు చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ లింకింగ్ ప్రక్రియ ఎలాగో ఒకసారి చూద్దాం.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారయితే
ఇన్ కమ్ టాక్స్ కట్టే వాళ్లు అయితే..మీరు ఇదివరకే రిజిస్టర్డ్ యూజర్ అయితే.. www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ హియర్ (Registerd User Login Here).. అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.. యూజర్ ఐడి, పాస్ వర్డ్ తోపాటు అక్కక డిస్‌ప్లే అయ్యే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ తో పాన్ ను లింక్ చేసే ఫారమ్ ఓపెన్ అవుతుంది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు (ఆధార్ లో ఉన్న విధంగా), క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర‍్తయిన వెంటనే .. సక్సెస్ ఫుల్లీ ఆధార్ లింక్ డ్ విత్ పాన్ అనే మెసేజ్ స్క్రీన్ పై కనిపిస్తుంది..
ఒకవేళ మీరు రిజిస్టర్డ్ యూజర్స్ కాకపోతే... www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ (New to e-filling Register yourself) అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. మీ వివరాలు ఎంటర్ చేయండి. మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి వస్తుంది. తర్వాత ఆ వివరాలతో లాగిన్ అయి.. ఆధార్, పాన్ ను లింక్ చేయండి.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారికి
వీరికి ఈ ప్రక్రియ మరింత సులువు..మొత్తం కేవలం 60 సెకన్లలో పూర్తవుతుంది. ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో కి వెళ్లాలి. ఆధార్ లింకింగ్ విత్ పాన్ మేడ్‌సింపుల్..క్లిక్ హియర్ (Aadhaar Linking With Pan Made Simple.. Click Here) అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.. తర్వాత త్రి కాలమ్స్‌తో ఉన్న టేబుల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వున్న ప్రకారం నిర్దేశిత కాలమ్ లో పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు (ఆధార్ లో ఉన్న విధంగా), క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అంతే... స్క్రీన్ పై సక్సెస్ ఫుల్లీ ఆధార్ లింక్ డ్ విత్ పాన్ (Successfully Aadhaar Linked with Pan) అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ మెసేజ్ రాకపోతే మనం ఎంట్రీ చేసిన వివరాలను మళ్లీ ఒకసారి సరి చూసుకుంటే..చాలు. ఆధార్ ను పాన్ తో లింక్ పూర్తవుతుంది.