బ్రెగ్జిట్ బ్లాస్ట్ తో అతలాకుతలమైన దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి
బ్రెగ్జిట్ బ్లాస్ట్ తో అతలాకుతలమైన దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి . సెన్సెక్స్ 645 పాయింట్ల నష్టంతో 26, 356 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 193 పాయింట్ల నష్టంతో 8,076 పాయింట్ల దగ్గర క్లోజయ్యాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా భారీ పతనంతో ట్రేడర్లను బెంబేలెత్తించిన మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత కొద్దిగా తెప్పరిల్లాయి. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఖరారు కావడంతో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు పతనం దిశగా పయనించాయి. ముఖ్యంగా ఐటీ,బ్యాంకింగ్, రియాల్టీ షేర్లు కుదేలయ్యాయి. దీంతో ఈ పరిణామాన్ని బ్లాక్ ఫ్రేడే గా విశ్లేషకులు వ్యాఖ్యానించారు.