నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌ తొలి దశకు రూ.8,500 కోట్లు

8500 Crore Investment in Navi Mumbai Airport - Sakshi

హైదరాబాద్‌: నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టు తొలి దశకు జీవీకే గ్రూప్‌ రూ.8,500 కోట్లు వెచ్చించనుంది. తొలి దశ పూర్తి అయితే ఏటా ఒక కోటి మంది ప్రయాణికులకు సేవలు అందించే వీలవుతుంది. బుధవారం ఇక్కడ జరిగిన జీవీకే పవర్, ఇన్‌ఫ్రా వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులకు జీవీకే గ్రూప్‌ చైర్మన్‌ జి.వి.కె.రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. మరో రూ.2,500–3,000 కోట్లు వ్యయం చేయడం ద్వారా సామర్థ్యం రెట్టింపు అవుతుందని చెప్పారు. మొత్తం 1,160 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఏటా 6 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించొచ్చు. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో మరో భాగస్వామి అయిన బిడ్‌వెస్ట్‌ నుంచి 13.5 శాతం వాటాను కొనుగోలు చేయాలని జీవీకే నిర్ణయించింది. కాగా, పంజాబ్‌లో 540 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టు తాలూకు రూ.3,510 కోట్ల రుణాల బదిలీకి డాయిష్‌ బ్యాంకుతో చర్చిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top