జీఎస్‌ఎం వినియోగదారులు@ 73.31 కోట్లు | @ 73.31 million GSM users | Sakshi
Sakshi News home page

జీఎస్‌ఎం వినియోగదారులు@ 73.31 కోట్లు

Oct 17 2015 2:05 AM | Updated on Sep 3 2017 11:04 AM

జీఎస్‌ఎం వినియోగదారులు@ 73.31 కోట్లు

జీఎస్‌ఎం వినియోగదారులు@ 73.31 కోట్లు

దేశంలో జీఎస్‌ఎం వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్ నెలలో 70 లక్షల మేర పెరిగింది. దీంతో మొత్తం జీఎస్‌ఎం వినియోగదారుల

న్యూఢిల్లీ: దేశంలో జీఎస్‌ఎం వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్ నెలలో 70 లక్షల మేర పెరిగింది. దీంతో మొత్తం జీఎస్‌ఎం వినియోగదారుల సంఖ్య 73.31 కోట్లకు చేరినట్లు పరిశ్రమ సమాఖ్య సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) పేర్కొంది. జీఎస్‌ఎం వినియోగదారుల సంఖ్య ఆగస్ట్ నెల చివరి నాటికి 72.61 కోట్లుగా ఉందని తెలిపింది. సెప్టెంబర్ నెలలో ఐడియా సెల్యులార్ వినియోగదారుల సంఖ్య ఇతర సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే గరిష్టంగా 26 లక్షలు పెరిగింది. దీంతో ఐడియా మొత్తం వినియోగదారులు 17 కోట్లకు చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement