వారఫలాలు (27-10 నుంచి 02-11-19వరకు)

Weekly Horoscope in Telugu - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో  ముఖ్య విషయాలు చర్చిస్తారు.  పనులలో ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుని సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు విశేష గుర్తింపు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు.  వారం చివరిలో భూవివాదాలు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల సాయంతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని  అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు మరింత ప్రోత్సాహం.  గృహం,వాహనాలు కొనుగోలు చేస్తారు. నేర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగాలలో అనుకోని ప్రమోషన్లు.  కళాకారులకు సన్మానాలు. వారం  ప్రారంభంలో అనారోగ్యం. ధనవ్యయం. నేరేడు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక  వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వస్తు, వస్త్రలాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల ద్వారా కొంత సహాయం అందుతుంది. ఆశ్చర్యకరవిషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు దక్కుతాయి. వారం మధ్యలో  వ్యయప్రయాసలు. బంధువులతో వైరం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు కొన్ని చివరిలో  వాయిదా వేస్తారు.  బంధువులతో లేనిపోని వివాదాలు. ఆరోగ్యభంగం.  కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు మరింత పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.  వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు తొందరపాటు నిర్ణయాలు తగదు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. పరిశోధనలపై ఆసక్తి చూపుతారు.   ఇంటి నిర్మాణ య త్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులు, విద్యార్థులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ఆలోచనలు కలసివస్తాయి. శుభకార్యాలలో చురుగ్గా  పాల్గొంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు.పనులు అనుకున్న విధంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళాకారులకు విదేశీ పర్యటనలు.  వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. నూతన ఉద్యోగాలు పొందుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.  పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన వార్తలు.  వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. వ్యయప్రయాసలు. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఉత్సాహంగా మఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. కాంట్రాక్టులు అనూహ్యంగా  పొందుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. బంధువులతో సత్సంబంధాలు నె«లకొంటాయి. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.  రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి.  వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన  పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యతిరేకులు కూడా సహకరిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్నవాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గి కొంత ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు.  సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.  ఆస్తి వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కోర్టు కేసుల పరిష్కారం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగ  ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు.  పోటీపరీక్షల్లో విజయం  సాధిస్తారు. మీ ప్రతిపాదనలకు కుటుంబంలో ఆమోదం లభిస్తుంది.  సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. వాహన, గృహయోగాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.  వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో విభేదాలు. దైవదర్శనాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.సింహంభట్ల సుబ్బారావుజ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top