
శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువుచైత్ర మాసం, తిథి శు.పాడ్యమి సా.3.54 వరకు, తదుపరి విదియ నక్షత్రం రేవతి తె.5.48వరకు (తెల్లవారితే గురువారం) తదుపరి అశ్వని, వర్జ్యం సా.4.30 నుంచి 6.18 వరకు, దుర్ముహూర్తం ప.11.44 నుంచి 12.32 వరకు, అమృతఘడియలు... రా.3.10నుంచి 4.53 వరకు, ఉగాది పర్వదినం.
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యం.
వృషభం: కొత్త విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.
మిథునం: మిత్రులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కర్కాటకం: పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. «దనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలం.
సింహం: వివాదాలు పరిష్కారం. బంధువుల నుంచి కీలక సందేశం. ఆలయాలు సందర్శిస్తారు. అనుకున్న పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యం.
కన్య: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తుల ఒప్పందాలు. వ్యవహారాల్లో విజయం. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
తుల: రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో మరింత పురోగతి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. కొన్ని వివాదాలు పరిష్కారం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. ఊహించని విధంగా ధనలబ్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గుతాయి.
మీనం: దనలాభం. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.– సింహంభట్ల సుబ్బారావు