25న వైఎస్సార్సీపీ భారీ ధర్నా | ysrcp protest on 25th at vizag | Sakshi
Sakshi News home page

25న వైఎస్సార్సీపీ భారీ ధర్నా

Jun 23 2015 6:57 PM | Updated on May 29 2018 4:18 PM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాకు దిగనుంది. ఓటుకు కోట్లు వ్యవహారం, ఖరీఫ్లో రుణ మంజూరు వంటి అంశాలపై ఆందోళనకు సిద్ధమవుతుంది

విశాఖపట్నం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాకు దిగనుంది. ఓటుకు కోట్లు వ్యవహారం, ఖరీఫ్లో రుణ మంజూరు వంటి అంశాలపై ఆందోళనకు సిద్ధమవుతుంది. ఈ నెల 25న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇందులో అన్ని నియోజవర్గ కార్యకర్తలు నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా ఖరీఫ్ రుణ మంజూరుపై బ్యాకర్లతో భేటీ ప్రస్తావన చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై ఏపీకి రావాల్సిన వాటాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement