వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నతస్థాయి కమిటీల ఏర్పాటు
													 
										
					
					
					
																							
											
						 పార్టీ పునఃవర్యవస్థీకరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నతస్థాయి కమిటీల నియామకం జరిగింది.
						 
										
					
					
																
	హైదరాబాద్: పార్టీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నతస్థాయి కమిటీల నియామకం జరిగింది. పార్టీ ఉన్నత స్థాయి కమిటీల నియామకానికి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. పార్టీ బలోపేతానికి ఉన్నత స్థాయి సమన్వయ కమిటీ, ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. 
	 
	ఉన్నతస్థాయి సమన్వయ కమిటీ సభ్యులుగా పార్టీ పీఏసీ సభ్యుడు భూమా నాగిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం. పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డిలను నియమించారు. 
	 
	ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటీ సభ్యులుగా పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డిలను నియమించారు.