ఒక్క హామీనీ నెరవేర్చని బాబు: వైఎస్సార్‌సీపీ | Ysrcp leaders takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఒక్క హామీనీ నెరవేర్చని బాబు: వైఎస్సార్‌సీపీ

Oct 29 2014 3:03 AM | Updated on Aug 9 2018 2:49 PM

అధికారం కోసం సాధ్యంకాని హామీలను గుప్పించారు. ఏ వర్గాన్నీ వదలకుండా వాన కురిసినట్లు వరాలు కురిపిం చారు.

* వైఎస్సార్‌సీపీ నేతలు
* విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి ధ్వజం


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘అధికారం కోసం సాధ్యంకాని హామీలను గుప్పించారు. ఏ వర్గాన్నీ వదలకుండా వాన కురిసినట్లు వరాలు కురిపిం చారు. ప్రభుత్వం ఏర్పడిన ఐదునెలల్లో ఒక్క హా మీనైనా నెరవేర్చినట్లు నిరూపించగలవా? ఒక్క రైతుకైనా.. ఒక్క సంఘానికైనా రుణం మాఫీ చేశావా?’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. నెల్లూరులో మంగళవారం వైఎస్సార్‌సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ  జిల్లా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డిలతో పాటు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, రాష్ట్ర వాలంటీర్ల విభాగం అధ్యక్షుడు, చం ద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు, జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్, కిలివేటి సంజీవ య్య, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అనితమ్మ హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రైతుల రుణాల న్నీ మాఫీ చేస్తానన్న బాబు మాట మార్చి పంట రుణాలు మాఫీ అని చెబుతున్నారన్నారు. బ్యాం కర్ల సమావేశంలో రోజుకోమాట చెబుతూ కాల యాపన చేస్తున్నారన్నారు.
 
 బాబు నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వచ్చేనెల 5న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు విజయసారుురెడ్డి ప్రకటించారు.  రైతు లు, బ్యాంకర్ల మధ్య మంచి సంబంధాలు ఉండేవని, బాబు వచ్చాక ఆ సంబంధాలు తెగిపోయాయని ఉమ్మారెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్‌ఆర్‌ని టార్గెట్ చేస్తూ 7 శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తాను ఇచ్చిన హామీలు, రుణాల మాఫీపై క్యాలెండర్ విడుదల చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశా రు. నాటి వైఎస్ పాలన.. నేటి బాబు పాలనను బేరీజు వేసుకుంటే ఎవరు ఎటువంటి వారో ప్రజ లకు అర్థమవుతుందన్నారు. వైఎస్ పాలనలో లబ్ధి పొందని కుటుంబం అంటూ లేదని గుర్తుచేశారు. టీడీపీకి ఓటేసిన వారంతా తప్పుచేశామని బాధపడుతున్నారని, వారికివే చివరి ఎన్నికలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. పల్లెల్లో టీడీపీకి చెందిన చోటా నాయకుడు కూడా ప్రజలకు అడ్డంకిగా మారారని, అందువల్ల ఈసారి వారికి గూబ గుయ్యిమనేలా బుద్ధి చెప్పాలని అన్నారు.  సమావేశంలో మేరుగ నాగార్జున, గౌతంరెడ్డి కూడా ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement