ఈసీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు | ysrcp leaders meets EC over kanaganepalle mpp election | Sakshi
Sakshi News home page

ఈసీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు

Dec 28 2016 4:51 PM | Updated on Aug 9 2018 4:22 PM

ఈసీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు - Sakshi

ఈసీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు

కనగానెపల్లె ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు బుధవారం ఈసీని కలిశారు.

హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిశారు. కనగానెపల్లె ఎంపీపీ ఎన్నిక సమయంలో మంత్రి పరిటాల సునీత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ నేత చల్లా మధుసూదన్ రెడ్డి ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి రాసిన లేఖను మధుసూదన్ రెడ్డి, ఈసీకి అందజేశారు.

ఎన్నికల సమయంలోని వీడియో ఫుటేజీని పరిశీలించి ఎంపీపీ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ అనంతపురం కలెక్టర్ను ఈసీ ఆదేశించారు.   

Advertisement
 
Advertisement
Advertisement