'కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి' | YSRCP Leaders Demand High Court in Kurnool | Sakshi
Sakshi News home page

'కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి'

Jul 27 2014 1:58 PM | Updated on Jun 1 2018 8:39 PM

'కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి' - Sakshi

'కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి'

ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ నివేదిక మేరకే ఏపీలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అనంతపురంలో స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ తో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ సీఈసీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని అంతకుముందు వైఎస్ఆర్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎయిమ్స్, ట్రి పుల్ ఐటీ, ఇండియన్ సర్వీసెస్ సెంటర్, సెంట్రల్ యూనివర్సిటీ నెలకొల్పాలన్నారు. హిందూపురం ప్రాంతంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement