ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసమే సెక్షన్ -8 తెరపైకి తెస్తున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి ఆరోపించారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసమే సెక్షన్ -8 తెరపైకి తెస్తున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.