
సాక్షి, కృష్ణా : జగ్గయ్యపేట మండలం రావిరాల, వేదాద్రి గ్రామాలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సోమవారం పర్యటించారు. వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు నాయకులు వేల్పుల రవికుమార్, రవిశంకర్, తుమ్మల ప్రభాకర్ ఉన్నారు.