వాకతిప్ప బాధితులకు వైఎస్ఆర్ సీపీ సాయం | ysrcp announces 50 thousand rupees for vakatippa crackers blasts victims | Sakshi
Sakshi News home page

వాకతిప్ప బాధితులకు వైఎస్ఆర్ సీపీ సాయం

Oct 24 2014 2:48 PM | Updated on Sep 5 2018 9:45 PM

వాకతిప్ప బాధితులకు వైఎస్ఆర్ సీపీ సాయం - Sakshi

వాకతిప్ప బాధితులకు వైఎస్ఆర్ సీపీ సాయం

వాకతిప్పలో బాణసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకోనుంది.

హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకోనుంది. మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున సాయం చేయనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం  బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాలు అందేవిధంగా ఒత్తిడి తెస్తామని వైఎస్ జగన్ చెప్పారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement