వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి | YSR CP leader attacked | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి

Mar 18 2016 4:03 AM | Updated on Aug 10 2018 8:16 PM

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి - Sakshi

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి

మండలంలోని చల్లాపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంజినరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ...

 సోమందేపల్లి: మండలంలోని చల్లాపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంజినరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనం, ఇసుక అక్రమ తరలింపుపై ప్రశ్నించడంతో పాటు అధికారుల దృష్టికి ఫిర్యాదులు తీసుకువెళుతున్నానన్న  కారణంతో  తనపై కక్ష సాదింపులకు దిగారన్నారు.

బుధవారం రాత్రి గ్రామంలో ఉండగా టీడీపీ నాయకులు సంజీవరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డితోపాటు మరి కొంతమంది తనపై దాడికి దిగి చిటికెన వేలిని విరగ్గొట్టారన్నారు. అనంతరం గ్రామస్తులు వచ్చి అడ్డుకోవడంతో పారిపోయారన్నారు. పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లగా అక్కడికి వచ్చి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమంలో కూడా అంజినరెడ్డి గ్రామ సమస్యలపై టీడీపీ నాయకులను నిలదీయడంతో ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.  దాడికి సంబంధించి బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement