విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 29న పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌ను జిల్లాలో విజయవంతం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 29న పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఉద్యోగులతో పాటు వ్యాపార, వాణిజ్య, కార్మిక వర్గాలను కూడగట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కాకినాడలోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి పార్టీ జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరు కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యవర్గసభ్యులు పాల్గొననున్నారు.
జేఎన్‌టీయూలో సమావేశం ఏర్పాట్లను శనివారం సాయంత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పరిశీలించారు. అనంతరం నేతలతో సమావేశమై చర్చించారు. వారితో పాటు కాకినాడ రూరల్, పెద్దాపురం, రాజోలు కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, తోట సుబ్బారావునాయుడు, బొంతు రాజేశ్వరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, జ్యోతుల రాజబాబు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, నాయకులు భోపాలపట్నం ప్రసాద్ తదితరులు ఉన్నారు.