సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దీక్షలు కొనసాగిస్తున్నారు.
తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దీక్షలు కొనసాగిస్తున్నారు. తుడా సర్కిల్లో చేపట్టిన దీక్షల్లో మెడికల్ షాపుల యజమానులు పాల్గొన్నారు. షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు తాము సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో కళాకారులు తమ పాటలతో అలరిస్తున్నారు. తుడా సర్కిల్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన దీక్షలకు వారు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో గేయాల ద్వారా తెలియజేశారు.