'జగన్ని చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి' | ysr congress party leader Dwarampudi Chandrasekhar Reddy takes on Congress party | Sakshi
Sakshi News home page

'జగన్ని చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి'

Dec 6 2013 2:39 PM | Updated on Mar 18 2019 7:55 PM

'జగన్ని చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి' - Sakshi

'జగన్ని చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి'

రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు.

రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శుక్రవారం కాకినాడలో ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసైన  బుద్ది తెచ్చుకోవాలని ఆయన చంద్రబాబుకు హితవు పలికారు.

చంద్రబాబు తన రెండు కళ్ల సిద్దాంతాన్ని వదిలిపెట్టి సమైక్య ఉద్యమంలో పాల్గొన్నాలని చంద్రశేఖరరెడ్డి సూచించారు. పోరాడాల్సింది పోయి జగన్ పై ఆరోపణలు చేయటం తగదన్నారు. కాగా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగింది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement