రాష్ట్రంలో జనమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ఉన్నారని, ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రజల్లో నిర్ణయం జరిగిపోయిందని
జనమంతా జగన్ వైపే..
Feb 9 2014 12:47 AM | Updated on Jul 25 2018 4:07 PM
సాక్షి, నరసరావుపేట :రాష్ట్రంలో జనమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ఉన్నారని, ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రజల్లో నిర్ణయం జరిగిపోయిందని పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి తెలిపారు. పట్టణంలోని 29 వార్డులో శనివారం బులియన్ మర్చంట్ అసోసియేషన్ పట్టణ కార్యదర్శి కాపులపల్లి ఆదిరెడ్డి, పార్టీ పట్టణ కోశాధికారి వక్కలగడ్డ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ విలువలతో కూడిన రాజకీయం చేస్తోందని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న ఇతర రాజకీయ పక్షాలను చూసి ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు.
నియోజకవర్గం కార్యకర్తలకు, అభిమానులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాము రాజకీయాలకు కొత్త కావడంతో కుళ్లు, కుతంత్రాలు తెలియవని, నీతివంతమైన పాలన అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం శివుడి బొమ్మసెంటర్‌లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విడదీయాలన్ని కుట్రలు పన్నే రాజకీయ నాయకులకు భవిష్యత్ లేకుండా చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సర్తాజ్ ఆలి, ఆళ్ళ పేరిరెడ్డి, పట్టణ కన్వీనర్ ఎస్‌ఏ హనీఫ్, ఉపాధ్యక్షుడు కొత్తమాసు వెంకటమల్లారావు, రొంపిచర్ల, నరసరావుపేట మండల కన్వీనర్లు ఓబుల్‌రెడ్డి, శంకర్ యాదవ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సెల్ కన్వీనర్లు కందుల ఎజ్రా, కుంజానందా, వేముల శివ, షేక్ ఖాదర్‌బాషా, పట్టణ యువజన విభాగం కన్వీనర్ రామిశెట్టి కొండలరావు, పట్టణ మహిళా కన్వీనర్ సుజాతాపాల్, పట్టణ ఉపాధ్యక్షుడు బిల్డర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement