పోలింగ్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దూరం | YSR Congress MLAs not to cast vote in rajya sabha election polling | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దూరం

Feb 6 2014 11:17 PM | Updated on Sep 2 2017 3:24 AM

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ఆవరణలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనడం లేదు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ఆవరణలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనడం లేదు. రాజ్యసభ  అభ్యర్థిని గెలిపించుకునేంతటి సంఖ్యాబలం తమకు లేదు కనుక తమ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటుందని ఫిబ్రవరి 23వ తేదీన పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి ప్రకటించిన విషయం విదితమే!

పోలింగ్‌లో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనరాదని విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి విప్ కూడా జారీ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల అగ్రనేతలను కలిసి గురువారం రాత్రి నగరానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానుసారం పోలింగ్ కు గైర్హాజరు కావాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement