ప్రభుత్వ అసమర్థత వల్లే సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు.
హైదరాబాద్ : ప్రభుత్వ అసమర్థత వల్లే సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రాష్ట్ర బడ్జెట్పై ఆమె సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే స్థితిలో ప్రభుత్వం లేదని విజయమ్మ విమర్శించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆస్తులు తక్కువగా ఉండి అప్పుల నిష్పత్తి ఎక్కువగా ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ఎక్కువగా ఉంచి ....అప్పులు తగ్గించారని విజయమ్మ అన్నారు. చేతకాని ప్రభుత్వం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని సాగనంపే రోజు దగ్గరలోనే ఉందని విజయమ్మ వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి బడ్జెట్ను కూడా పూర్తిగా చదవలేక పోయారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు చేసే బడ్జెట్ ఉంటుందని విజయమ్మ హామీ ఇచ్చారు.