మహానేతా.. మరువలేం

YS Rajashekara Redy Ninth Death anniversary In Tirupati - Sakshi

జిల్లావ్యాప్తంగా వైఎస్‌కు ఘన నివాళి

భారీయెత్తున సేవా కార్యక్రమాలు

రాజన్న సంక్షేమ పథకాలను స్మరించుకున్న ప్రజలు

దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహాలను పూలమాలలతో ముంచెత్తారు. పలుచోట్ల పాలాభిషేకం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పెద్దయెత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాజన్న అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు.  

సాక్షి, తిరుపతి :మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదవ వర్ధంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, వీధులు, వార్డులు తేడా లేకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పుంగనూరు పరిధిలోని చౌడేపల్లె, సోమలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిం చారు. తిరుపతిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో యువనాయకుడు భూమన అభినయరెడ్డి,  పార్టీ పట్టణ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నగరి నియోజక వర్గం పుత్తూరులో ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అంబేడ్కర్‌ కూడలిలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభు త్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

గంగాధరనెల్లూరు పరిధిలోని శ్రీరంగరాజపురంలో వైఎస్సార్‌ విగ్రహానికి ఎమ్మెల్యే నారాయణస్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్ని మండలాల్లో ఘనంగా నివా ళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం దామినేడు వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో  పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయితిప్పారెడ్డి తొట్టివారిపల్లెలో వైఎస్సార్‌ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రెడ్డివారిపల్లెలో సంతాప సభ నిర్వహించి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చౌడేశ్వరి కూడలిలో వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించారు. పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చిం తల రామచంద్రారెడ్డి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం గుండ్లపల్లె, తవణంపల్లెలో వైఎస్సార్‌ విగ్రహానికి ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌  పూలమాలులు వేసి నివా ళులు అర్పించారు.

గోవిందపల్లెలో అన్నదానం చేశారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో చిత్తూరు పార్లమెం టరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు భారీ బైక్‌  ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్, జెడ్పీ, డీసీసీ బ్యాంక్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనుప్పల్లె్లలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు పార్లమెంటరీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి డీసీసీ బ్యాంక్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మీనగర్‌ కాలనీలోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, వైఎస్సా ర్‌ కాలనీలో స్టీలు ప్లేట్లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో  వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివా ళులర్పించారు. తంబళ్లపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి కురబలకోటలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కుప్పంలో పార్టీ నియోజకవర్గ సమన్వయర్త చంద్రమౌళి ఆధ్వర్యంలో రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం పట్టణంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సా ర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.  జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పార్టీ కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ట్రేడ్‌యూనియన్, విద్యార్థి విభాగం నాయకులు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్‌లు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top