చెన్నారెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ | ys jagan visits pulivendula | Sakshi
Sakshi News home page

చెన్నారెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ

Sep 2 2015 1:13 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని దినేష్ మెడికల్ సెంటర్‌లో అనారోగ్యంతో చికిత్సపొందుతున్న సమీప బంధువు చెన్నారెడ్డిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరామర్శించారు.

పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని దినేష్ మెడికల్ సెంటర్‌లో అనారోగ్యంతో చికిత్సపొందుతున్న సమీప బంధువు చెన్నారెడ్డిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఇడుపుల పాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సభలో పాల్గొని నివాళులు అర్పించిన అనంతరం జగన్ పులివెందుల వెళ్లారు. శ్వాసకోశవ్యాధితో బాధపడుతూ కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చెన్నారెడ్డిని ఆయన పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement