‘సేవారత్న’ పుస్తకావిష్కరణ  | YS Jagan Mohan Reddy Releases Seva Ratna Book | Sakshi
Sakshi News home page

Jan 8 2019 9:06 AM | Updated on Jan 8 2019 9:06 AM

YS Jagan Mohan Reddy Releases Seva Ratna Book - Sakshi

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వైఎస్‌ జగన్‌. చిత్రంలో మాజీ ఎంపీ  మిథున్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు 

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిపై ‘సేవా రత్న’ (ప్రేరణ, ప్రాణం, వైఎస్‌ అనేది ట్యాగ్‌ లైన్‌)అనే పుస్తకాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన వైఎస్సార్‌ జిల్లా పార్టీ నాయకులు ఆయనతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి, వైఎస్‌ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉందని.. ఆ విషయాలన్నీ ఈ పుస్తకంలో ప్రచురించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాయచోటి, రైల్వేకోడూరు, కడప ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్‌బీ అంజద్‌బాషా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement