కాన్వాయ్‌ లేకుండానే వెళ్లిపోయిన జగన్ | YS Jagan Mohan Reddy leave for home from Assembly without Convoy | Sakshi
Sakshi News home page

కాన్వాయ్‌ లేకుండానే వెళ్లిపోయిన జగన్

Aug 22 2014 3:32 PM | Updated on Aug 8 2018 5:51 PM

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. విపక్ష నాయకుడికి కల్పించిన భద్రత విషయంలో టీడీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్‌ పార్కింగ్‌కు స్థలం కేటాయించకుండా ఆయనను ఇబ్బంది పెడుతోంది. దీనికి నిరసనగా వైఎస్ జగన్ కాన్వాయ్‌ లేకుండానే అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

విపక్ష నేతకు ఇవ్వాల్సిన కాన్వాయ్ విషయంలో కూడా ఇంటెలిజెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరించారు. పైలట్, ఎస్కార్ట్ కోసం పాత వాహనాలకు కేటాయించారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకుడి భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష ధోరణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. వైఎస్ జగన్ భద్రతపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement