
సాక్షి, హైదరాబాద్ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సోదరులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం ఇవన్నీ జీసస్ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత సందేశాలని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని చెప్పారు. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.