కన్నీరు తుడిచి..వెన్ను తట్టేందుకు | ys jagan Hudood storms victims Visitation in Visakhapatnam district | Sakshi
Sakshi News home page

కన్నీరు తుడిచి..వెన్ను తట్టేందుకు

Oct 14 2014 4:10 AM | Updated on Jul 25 2018 4:07 PM

కన్నీరు తుడిచి..వెన్ను తట్టేందుకు - Sakshi

కన్నీరు తుడిచి..వెన్ను తట్టేందుకు

హుదూద్ తుపాను సృష్టించిన విలయంతో అతలాకుతలమైన విశాఖపట్నం జిల్లాలో బాధితులను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు

 నేడు జిల్లా మీదుగా విశాఖ వెళ్లనున్న జగన్
 ఆ జిల్లాలో తుపాను
 బాధితులకు పరామర్శ

 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :హుదూద్ తుపాను సృష్టించిన విలయంతో అతలాకుతలమైన విశాఖపట్నం జిల్లాలో బాధితులను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ సోమవారం తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 9 గంటలకు  మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట చేరుకుంటారు. విశాఖ జిల్లాలో బాధితుల కోసం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమకూర్చిన వాటర్ ట్యాంకర్లను తరలించే వాహనాలను జగ్గంపేట వద్ద జాతీయ రహదారిపై ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం రాజుల కొత్తూరుకు సమీపంలో కొద్దిసేపు ఆగి, స్థానికులతో మాట్లాడి, విశాఖ జిల్లాలో తుపాను బాధితుల పరామర్శకు వెళతారు.
 

Advertisement
 
Advertisement
Advertisement