ముస్లింలకు వైఎస్‌ జగన్‌ రంజాన్‌ నెల శుభాకాంక్షలు | YS Jagan Greetings Muslim For Holy Month Of Ramadan Begins | Sakshi
Sakshi News home page

ముస్లింలకు వైఎస్‌ జగన్‌ రంజాన్‌ నెల శుభాకాంక్షలు

May 6 2019 7:10 PM | Updated on May 7 2019 2:34 AM

YS Jagan Greetings Muslim For Holy Month Of Ramadan Begins - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నియమనిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకొం టారని, వారికి అల్లాహ్‌ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షిం చారు. మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప సందర్భం అని ఆయన అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement