 
													సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా నందికొట్కూరు, 11.30 గంటలకు ఎమ్మిగనూరు, మధ్యాహ్నం 1.30 గంటలకు అనంతపురం జిల్లా మడకశిర, 3.30 గంటలకు పెనుకొండ నియోజక వర్గంలోని సోమందేపల్లిలో జరిగే సభల్లో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
