
సాక్షి, హైదరాబాద్ : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యామూల్ కుమారుడి పెళ్లికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మదాపూర్‌లోని దస్‌పల్లా హోటల్‌లో జరిగిన ఈ వివాహా వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి హాజరైన ముఖ్యమంత్రితో సెల్పీలు దిగేందుకు అక్కడికి వచ్చిన అతిథులు పోటీపడ్డారు. శ్యాముల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సలహాదారుడుగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు కార్యక్రమం అమలు, పర్యవేక్షణ కమిటీకి శామ్యూల్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.