ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్టు | Youth held for raping six year old girl | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్టు

Published Thu, Jan 2 2014 10:59 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

Youth held for raping six year old girl

ఆరేళ్ల బాలికపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేసిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 31 రాత్రి అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఈ దారుణం జరిగింది. వలీ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ముగ్గరు పిల్లలు తమ ఇంట్లో పడుకుని ఉండగా చూశాడు. ఆ ఇంట్లో అప్పటికి పెద్దవాళ్లు ఎవరూ లేరు.

దీంతో ఇంట్లోకి వెళ్లి ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.  సంఘటన జరిగే సమయానికి బాలిక తల్లిదండ్రులు ఆలయానికి వెళ్లారని ఆయన చెప్పారు. ఈ సంఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తెలిపిన పోలికల ఆధారంగా పోలీసులు వలీని అరెస్టు చేశారు. నిర్భయ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement