కర్నూలు జిల్లా ఆస్పరి గ్రామ పంచాయతీలో ఇంతకు ముందు ఎస్సీలకు కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రస్తుతం ఇతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఆస్పరి (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా ఆస్పరి గ్రామ పంచాయతీలో ఇంతకు ముందు ఎస్సీలకు కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రస్తుతం ఇతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే... ఆస్పరి మేజర్ పంచాయతీలోని షాపింగ్ కాంప్లెక్‌ను ఎస్సీలకు కేటాయించేవారు.
కాగా ఈసారి ఎస్సీలకు కాకుండా ఇతరులకు కేటాయించడంతో ఆగ్రహించిన మహానంది అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే అతణ్ణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.