బాసరలో యనమల మనవరాలికి అక్షరాభ్యాసం | Yanamala ramakrsnudu at Basra | Sakshi
Sakshi News home page

బాసరలో యనమల మనవరాలికి అక్షరాభ్యాసం

Oct 19 2015 1:19 PM | Updated on Aug 27 2018 8:46 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి మనవరాలికి ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో సోమవారం అక్షరాభ్యాసం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి మనవరాలికి ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో సోమవారం అక్షరాభ్యాసం జరిగింది. యనమల దంపతులు, వారి కుమార్తె కృష్ణ సాహిత్య, అల్లుడు మహేష్, మనవరాలు సృష్ణి వైష్ణవి (3) కి అక్షరాభ్యాసం చేయించారు.

యనమల తో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు సుధాకర్ యాదవ్ దంపతులు కార్యక్రమం లో పాల్గొన్నారు.  సృష్ణి వైష్ణవి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేద పండితులు శ్రీనివాస్, సంజీవ్ నిర్వహించారు. అనంతరం మంత్రి యనమల గోదావరి నదిని పరిశీలించారు. అమరావతి నిర్మాణ స్థూపం కోసం గోదావరి నీటిని, మట్టిని స్థానిక టీడీపీ నాయకులు సేకరించి యనమలకు ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement