
పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన జగన్
పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. ఇప్పటివరకూ 30 శాతం పొగాకు విక్రయాలు కూడా జరగలేదని జగన్ కు రైతులు స్పష్టం చేశారు.
పొగాకు వేలం కేంద్రానికి మీరు వచ్చిన వెంటనే కేజీపై రూ. 20 పెంచారంటూ జగన్ కు రైతులు విన్నవించారు. కనీసం కేజీ పొగాకు రూ. 150 ఉంటే కాని గిట్టుబాటు కాదని రైతులు జగన్ కు వివరించారు.