‘పుకార్లు నమ్మొద్దు.. వైఎస్‌ఆర్‌సీపీలోనే’ | Won't Leave Party, Will Stay with YS Jagan, Says YSRCP MLA Bala Nagireddy | Sakshi
Sakshi News home page

పుకార్లు నమ్మొద్దు.. వైఎస్‌ఆర్‌సీపీలోనే ఉంటా

Oct 5 2017 8:10 PM | Updated on May 29 2018 4:40 PM

Won't Leave Party, Will Stay with YS Jagan, Says YSRCP MLA Bala Nagireddy - Sakshi

సాక్షి, కర్నూలు : తాను పార్టీ మారుతున్నాననే వార్తల్లో నిజం లేదని కర్నూలు జిల్లా మంత్రాలయం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి చెప్పారు. కొందరు కావాలనే వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. వదంతుల గురించి తాను ఆలోచించడం లేదని చెప్పారు. పార్టీ మారే ఉద్దేశం ఉన్నవారే పుకార్ల గురించి ఆలోచిస్తారని అన్నారు.

పుకార్లు ఎన్ని సృష్టించుకున్నా.. తాను మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడనని చెప్పారు. చివరి వరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే కొనసాగుతానని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement