‘దిశ’తో మహిళలకు భద్రత 

Women Praises CM YS Jagan Regarding Disha Act In Kurnool - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

సాక్షి, కర్నూలు (న్యూటౌన్‌): ఏపీ దిశ–2019 చట్టంతో స్త్రీలకు భద్రత లభిస్తుందని పలువురు మహిళలు పేర్కొన్నారు. ఆదివారం కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా జాయింట్‌ సెక్రటరీ ముంజుశ్రీ మాట్లాడుతూ.. మహిళలపై నేరాలకు పాల్పడితే వారం రోజుల్లో విచారణ జరిపి, నేరం రుజువైతే 21రోజుల్లో తగిన శిక్ష పడేలా చట్టం తీసుకురావడం సామాన్యవైన విషయం కాదన్నారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి..ఇలాంటి చట్టాన్ని తీసుకురాలేదని చెప్పారు. మహిళలకు రక్షణ, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో లక్ష్మీదేవి, పద్మావతి, కళావతి, రమాదేవి, రాణి, లక్ష్మీ, రమిజాబీ, కమలమ్మ, కాంతమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు కాశన్న, వీరయ్య, రాము, రాజశేఖర్‌రెడ్డి, నరసింహగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top