స్వైన్ ఫ్లూ తో మహిళ మృతి | women died due to swine flu in ananthpuram distirict | Sakshi
Sakshi News home page

స్వైన్ ఫ్లూ తో మహిళ మృతి

Feb 11 2015 10:49 AM | Updated on Sep 28 2018 3:39 PM

అనంతపురం జిల్లాలో స్వైన్‌ప్లూ కలకలం సృష్టిస్తోంది.

 అనంతపురం: అనంతపురం జిల్లాలో స్వైన్‌ప్లూ కలకలం సృష్టిస్తోంది. తాజాగా స్వైన్ ఫ్లూ తో తనకల్లు మండలం బత్తులపల్లికి చెందిన నాగేశ్వరి(29) అనే మహిళ బుధవారం మృతి చెందింది. గత నెల 25 న ప్రసవం కోసం నాగేశ్వరి  ఆర్డీటిలో ఆస్పత్రిలో చేరింది. కాగా గర్భంలోనే శిశువు మృతి చెందగా, తీవ్ర జ్వరంతో బాధపడుతూ నాగేశ్వరి  ఆర్డీటిలోనే  చికిత్స పొందుతోంది. 

జనవరి 27న స్వైన్ ప్లూ లక్షణాలు కనబడుతున్నాయని ఆర్డీటి వైద్యులు అనంతపురం డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి తెలిపారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాధితురాలికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందింది. దీంతో నాగేశ్వరి బంధువులు విషాదంలో మునిగిపోయారు. మృతురాలికి భర్త , ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
( బత్తలపల్లి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement